సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం ఆవరణలోని భారీ పందిలాల్లో శ్రీ అమ్మవారి దీక్షాపరులచే ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమం నిర్వహించారు. 400 మంది పైగా దీక్షాపరులు ఈ పూజ కార్యక్రమం లో పాల్గొన్నారని పూజలో పాల్గొన్న దీక్షాపరులు కి ప్రసాదం అందజేశామని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి హరిసూర్య ప్రకాష్ తెలిపారు. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి I.A. S. దర్శించుకున్నారు మరియు నూతనంగా వివాహం చేసుకొన్న ఆమె కుమారుడు చదలవాడ భరత్ చంద్ర శ్రీమతి ప్రత్యూష దంపతులు శ్రీ అమ్మవారి ని ఆలయ మర్యాదలతో దర్శించుకొని దేవాలయంలో శాశ్వత నిత్యాన్నాదానం వితరణకి 25,000 రూపాయలు కానుకగా సమర్పించారు.
