సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల బైకర్, నారి నారి నడుమ మురారి సినిమాలతో ఓ మోస్తరు వరుస హిట్స్ అందించి ట్రాక్ లోకి వచ్చిన శర్వానంద్ తాజా చిత్రం ‘బోగి’ హ్యాట్రిక్ హిట్ కొట్టే అంచనాలతో నేడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా కధ విషయానికి వస్తే.. 1960ల నాటి తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియాడికల్ కథ ఇది. ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గులగుట్ట అనే కల్పిత గ్రామం లో మొదలవుతుంది. . ఆ గ్రామంలో ఊరి పటేల్‌దే రాజ్యం. ఆయన చెప్పిందే చట్టం. ఆయన నిర్ణయమే గ్రామస్తులకు శాసనం. ఎదురు మాట్లాడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోననే భయంతో గ్రామస్తులు బతుకుతుంటారు.ఆ గ్రామంలో కమ్మరి గంగ (శర్వానంద్) తన కుటుంబమే ప్రపంచంగా, ఐదుగురు అక్కాచెల్లెళ్లతో కలసి జీవిస్తుంటాడు., కష్టపడి పనిచేసే సాధారణ శ్రామికుడిగా కనిపిస్తాడు.అయితే ఊరి పటేల్ (శరత్ లోహితస్వ) తో జరిగిన ఒక వివాదం, తిరుగుబాటు గంగ జీవితంలోకి వచ్చే కొన్ని అనూహ్య సంఘటనలు అతడి కుటుంబాన్ని, గ్రామాన్ని కుదిపేస్తాయి.మరి గంగ విజయం సాదించాడా? అన్నది వెండి తెరపై చూడవలసిందే.. సినిమాను నటీనటుల నటనను విశ్లేషిస్తే .. చాల కాలంగా సినిమాలలో వస్తున్నా కధే.. ఈ కథా నేపథ్యానికి బలమైన భావోద్వేగాలు జోడిస్తే మంచి గ్రామీణ యాక్షన్ డ్రామా తయారవుతుంది. కానీ దర్శకుడు సంపత్ నంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయారు. సన్నివేశాలు ప్రేక్షకుడికి బలంగా అనుభూతి కలిగించేలా తెరకెక్కించడంలో విఫలమయ్యారు. గంగ పాత్రలో శర్వానంద్ కనిపించే కొన్ని సన్నివేశాలు, ఆయన చేసే యాక్షన్ ప్రేక్షకుడికి కొంత ఆసక్తిని కలిగిస్తాయి. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చక్కగా పాత్రలో ఇమిడి పోయింది. డింపుల్ హయతి కు సో సో.. ఇక మొదటి భాగం పర్వేలేదు. కానీ ఇంటర్వెల్ తరువాత నిరాశపరుస్తుంది. చివరకు క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ కూడా పెద్దగా ఆశ్చర్యపరచదు. దానికి తోడు క్లైమాక్స్‌ను ముగించిన తీరు మరింత అసహనానికి గురిచేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *