సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం కొవ్వాడ అన్నవరం – వెల్లుటూరు గ్రామంలో రీజువెన్ – జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆధునిక ఆరోగ్య పరీక్షలు – అసంక్రమిక వ్యాధుల వైద్య శిబిరాన్ని మంగళవారం స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు ఆరోగ్యమే మహా భాగ్యము అని గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఉచిత వైద్య శిబిరాలను అందరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలన్నారు. రక్తపోటు, గుండె, మధుమేహం, బిపి, షుగర్, ఈసీజీ, దంతం తదితర వైద్య పరీక్షలను అనుభవజ్ఞులైన ప్రభుత్వ వైద్యులచే అందించడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబు కు కూడా పలు వైద్య పరీక్షలను నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య శాఖాధికారులు,గ్రామస్తులు, పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *