సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో నేడు, మంగళవారం ఉదయం శ్రీ అమ్మవారి సన్నిధిలో పూజల ఉపయోగ నిమిత్తం గొల్లవానితిప్ప కి చెందిన భక్తులు కొప్పర్తి బేబీ శ్రీ ఫణి అనీషా రూ 2,20,000/- లు విలువ చేసే 766 గ్రాముల వెండి పళ్లెం, 200 గ్రాముల వెండి గిన్నె ఉద్ధరిణి సమర్పించారు వీరికి ఆలయ అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు, దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం తో సత్కరించగా, ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు ఉదీశి మీనాక్షి, మిర్తిపాటి గున్నేశ్వరరావు, పాపొలు ఏడుకొండలు ప్రసాదం ఫోటో అందచేసారు
