సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ తాజాగా నేడు, గురువారం విడుదలైంది. 2027 ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు AP Inter Exams జరుగుత్తాయి. రెగ్యులర్, బ్యాక్లాగ్ విద్యార్థులకు ఆయా పరీక్ష రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని ఏపీ ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో ప్రకటించారు.ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఫస్టియర్ పరీక్షలు, ఫిబ్రవరి 25వ తేదీ నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇక జనరల్ కోర్సులకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు.. అలాగే ఒకేషనల్ కోర్సులకు సంబంధించి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మొత్తం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయని ఏపీ ఇంటర్ బోర్డు పేర్కొంది. ఈ ప్రాక్టికల్ పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్ సెషన్ (ఆదివారాల్లో కూడా) ఉంటాయని తెలిపారు.
