సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని కత్తిపూడి జాతీయ రహదారిపై రావికంపాడు జంక్షన్‌ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. భవానీ భక్తుల మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి దర్శనం కోసం కాలినడకన వస్తున్న భవానీ భక్తులు రోడ్డు ప్రమాదంలో వాహనం ఢీకొనడం తో మృతిచెందటం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *