సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అందరు ఆ దారుణ విషాదాలు మరచిపోయారు అనుకుంటున్నా తరుణంలో.. .ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మళ్లీ కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొత్తగా 14 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆరోగ్య శాఖ తక్షణమే అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అనధికారికంగా మరిన్ని కేసులు ఉండే అవకాశం ఉంది. వైరస్ జన్యుక్రమ విశ్లేషణ కోసం 5 నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. జూన్ 26 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 14 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కడప జిల్లా 8, గుంటూరులో 3, విశాఖ, మంగళగిరి కాకినాడ జిల్లాల్లో ఒక్కో కేసు గుర్తించారు. వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదైనా, అయితే ఒకేచోట గుంపుగా బయటపడలేదని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం కరోనా వచ్చిన వారంతా హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుల్లో ఇప్పటికే నలుగురు మరణించినట్లు ఆరోగ్య శాఖ వర్గాలు ధ్రువీకరించాయి. మిగిలిన బాధితుల్లో ముగ్గురు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండగా, ఇతరులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. తాజగా మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్‌లో నిన్న కరోనా లక్షణాలతో వచ్చిన ఒక వ్యక్తికి వైద్యులు చికిత్స అందించి హోం ఐసోలేషన్‌కు పంపించారు.అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్లు, ఆక్సిజన్ నిల్వలను సిద్ధంగా ఉంచు కోవాలని స్పష్టమైన రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.
