సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 12 ఏళ్లుగా ప్రధాని మోడీ హయాంలో భారతీయ రైల్వే అనేక అధునాతన సౌకర్యాలతో దేశవ్యాప్తంగా ప్రజలకు మెరుగైన సేవలు తో దూసుకొని పోతుంది. తాజగా భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయి చేరింది. దేశంలో హైడ్రోజన్‌తో నడిచే తొలి రైలును నేడు, శుక్రవారం, ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. హరియాణాలోని జింద్-సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలు ప్రయాణించనుంది. . దేశ చరిత్రలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతను రైల్వేలో వినియోగిస్తున్నారు. హైడ్రోజన్ ద్వారా విద్యుదుత్పత్తి చేసి రైలును నడిపే ఈ సాంకేతికతను డీజిల్ ట్రైన్స్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చారు. .
