సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కోనసీమ జిల్లాలో ఈసారి వర్షాలు కురవకపోవడంతో సాగునీటి నిర్వహణను పర్యవేక్షించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బైక్‌పై ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కొత్తపేట, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని గోదావరి సెంట్రల్ డెల్టా కాలువల వెంబడి ప్రయాణించారు. ఈ సందర్భంగా లాకుల నీటిమట్టాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి నల్ల లాకులను మంత్రి తనిఖీ చేశారు. గత 70 ఏళ్ల చరిత్రలో జులై నెలలో గోదావరి నదికి ఇంత తక్కువ ఇన్ ఫ్లో రావడం ఇదే మొదటిసారి అని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. 70 శాతం కాలువలు, 30 శాతం వర్షాలపై ఆధారపడి డిజైన్ చేసిన డెల్టాలో ఈసారి కాకినాడ రూరల్, అమలాపురం, ముమ్మిడివరం శివారు ప్రాంతాల్లో ఉన్న నీటి ఎద్దడిని సమస్యలు రానున్నాయని అక్కడి రైతాంగం కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుతెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *