సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమండ్రిలోని ఆంధ్రా పేపర్ మిల్స్ యాజమాన్యం వైఖరిపై నేడు, శుక్రవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా గోదావరినది కాలుష్యం లో సగం ఆంధ్రా పేపర్ మిల్స్ వారే బాధ్యత వహించాలని నదిలోకి కాలుష్యాన్ని విడిచిపెడుతూ పన్నులు మాత్రం ఎగవేస్తునారు.. ‘ఆంధ్రా పేపర్ మిల్స్ .. పన్నులు చెల్లించి పుష్కరకాలం దాటింది. పన్నులు చెల్లించమంటే కోర్టులకెళ్లి కాలయాపన చేస్తున్నారు.. తప్పు సరిదిద్దుకునే అవకాశం ఇచ్చిన స్పందించడం లేదు. నోటీసు పంపి 3 నెలల సమయం ఇచ్చినా కనీస స్పందన లేదు. ఆంధ్రా పేపర్ మిల్స్ పై ఇక ఉపేక్షించం .. కఠిన చర్య లు తీసుకుంటాం ’’ అని పవన్ హెచ్చరించారు. గతంలో గోదావరి నదిలో ఆంధ్ర పేపర్ మిల్స్ వదులుతున్న వ్యర్దాలను పవన్ రాజమండ్రిలో స్వయంగా పరిశీలించారు. .
