సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉద్యమ బాటకు కార్యాచరణ రూపొందించుకొంటున్న ఏపీలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై.. రేపు శనివారం విజయవాడలో JAC నేతలు సమావేశం అవుతున్న నేపథ్యంలో… వారి సమస్యలపై చర్చించేందుకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. రేపు శనివారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో సీఎం చంద్రబాబు, ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ కానున్నారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటుతో పాటు పీఆర్సీ, డీఏ బకాయిలు తదితర సమస్యలపై చర్చించనున్నారు.నిజానికి గత గురువారం ఏపీ జేఏసీ నేతలు ఎ.విద్యాసాగర్, డీవీ రమణ, భారతీ ప్రసాద్ తదితరులు సీఎం చంద్రబాబును కలిశారు. అపుడు అయన .రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా దృష్ట్యా ఉద్యోగులకు న్యాయంగా చేయాల్సిన వాటిని చేస్తామని అయితే కాస్త ఓపిక పట్టాలని చెప్పినట్టు సమాచారం.తాము కూడా ఈ చర్చలను ఆహ్వానిస్తున్నామని ఏపీ జేఏసీ నాయకులు .పేర్కొన్నారు.
