సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోదావరి జిల్లాలలో గత 4 నెలలుగా పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళన బాట పట్టిన చేపలు రొయ్యలు పండించే ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఫై ఒత్తిడి పెంచడంలో భాగంగా భీమవరం జోన్ ఆక్వా రైతుల ఆహ్వానం మేరకు ఈ జులై నెల 15న మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ భీమవరం రానున్నారు. ఈ ప్రాంత గోదావరి జిల్లాల ఆక్వా రైతులతో నేతలతో భేటీ కానున్నారు. ఈనేపథ్యంలో భీమవరం పట్టణ శివారు ఉండి బైపాస్ రోడ్డులోని అనువైన స్థలాన్ని భీమవరం వైసిపి ఇంచార్జి చినమిల్లి వెంకట రాయుడు, మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాధ్, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు Tరఘురాం పరిశీలించారు.భీమవరం లో వైసీపీ జిల్లా నేతల మీడియా సమావేశంలో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టవని, చేపలు రొయ్యలు అమ్మకాలలో ,ఎగుమతులలో, మెతలు రేట్లు పెంపులో సిండికేట్ లను ప్రోత్సహించి అయినకాడికి ఆక్వా రైతులను దోచుకోవడమే ప్రభుత్వ పెద్దల పరమావధిగా ఉందని మాజీ మంత్రి పేర్ని నాని తదితర వక్తలు విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *