సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హర్ముజ్ లో 2వాణిజ్య నౌకలపై జరిగిన డ్రోన్ లా దాడి ఇరాన్ చేసిందని ఆరోపిస్తూ ( ఇరాన్ ఖండించింది) అమెరికా తిరిగి ఇరాన్ ఫై దాడులకు దిగటం దానికి ప్రతిగా గల్ఫ్ దేశాలలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మిసైల్స్ దాడులు చెయ్యడంతో మరల యుద్ధం మొదలయింది. గడిచిన 48 గంటల్లో ఇరాన్ తీరప్రాంతాల్లోని దాదాపు 170కి పైగా సైనిక స్థావరాలపై అమెరికా సైన్యం మిసైల్స్ తో విరుచుకుపడినట్లు అమెరికా ప్రకటించింది. ప్రస్తుతం . హోర్ముజ్‌ జలసంధి ఇరాన్ నియంత్రణలో లేదని, తమ నియంత్రణలోనే ఉందని తెలిపింది. ఇప్పటికే 800 వాణిజ్య నౌకలు, 380 మిలియన్ బ్యారెళ్ల చమురును హోర్ముజ్ దాటించామని ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఇదిలా ఉండగా తాజగా ఏర్పడిన యుద్ధ పరిస్థితుల కారణంగా.. భారత్ కు ముడి చమురు, ఎల్పీజీ తీసుకెళుతున్న 9 భారతీయ ట్యాంకర్లు పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకుపోయాయి. తొమ్మిది ట్యాంకర్లలో 198 మంది భారతీయులు చిక్కుకుపోయారు. ఆ ట్యాంకర్లు జలసంధి గుండా ప్రయాణించేందుకుఅనుకూల పరిస్థితి కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *