సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ మరో అధునాతన సాంకేతికత వైపు అడుగు వేసింది. దేశంలో నెట్‌వర్క్ లేని మారుమూల ప్రాంతాలు, కొండ కోనల్లోనూ నిరంతరాయంగా కమ్యూనికేషన్ అందించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఓ సరికొత్త శాటిలైట్ ఫోన్‌ను నేటి గురువారం నుండి అందుబాటులోకి తీసుకొచ్చింది. పన్నులతో కలిపి దీని ధరను రూ.1,34,166గా నిర్ణయించారు. సాధారణ స్మార్ట్‌ఫోన్‌ల వలే కాకుండా, ఇది నేరుగా అంతరిక్షం లోని ఉపగ్రహాల సాయంతో పనిచేస్తుంది. మొబైల్ నెట్‌వర్క్ పరిధి దాటిన ప్రాంతాల్లోనూ కొండలు కోనలు ఎక్కడ ఉన్న శాటిలైట్ కనెక్టివిటీ అందిస్తుంది.అత్యవసర పరిస్థితుల్లో రక్షణ కోసం ‘SOS’ ఫీచర్ ఇందులో ఉంది. దీర్ఘకాలిక బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే ఈ ఫోన్ సాధారణ మొబైల్ వినియోగదారుల కోసం ఉద్దేశించింది కాదు.ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. నెట్‌వర్క్ లేని ప్రదేశాలలో క్లిష్టమైన విధులు నిర్వహించే వ్యూహాత్మక రంగాలు, వ్యక్తుల కోసం దీనిని డిజైన్ చేశారు. అడ్వెంచర్ ట్రావెలర్స్ ఈ శాటిలైట్ ఫోన్ కొనుగోలు చేయొచ్చు.ఈ సేవలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి బీఎస్‌ఎన్‌ఎల్ 9768866652 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.
