సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ ఆగస్టు 1 నుండి ఆర్ధిక విధానాలలో కొత్త మార్పులు రానున్నాయి. మొదటగా గృహ, వాణిజ్య LPG సిలిండర్ల ధరలను సమీక్షించి నూతన రేట్లను ప్రకటిస్తాయి. సబ్సిడీ ఖాతాలో జమ అయిందో లేదో తనిఖీ చేసుకోవడం మంచిది. ఇక ఆగస్ట్ 1 నుంచి రైల్వే శాఖ తత్కాల్ టికెట్ల విషయంలో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించబోతుంది. ఈ నిర్ణయంతో టోకెన్ కోసం ఒకసారి, బుకింగ్ కోసం మరోసారి క్యూలలో నిలబడే ఇబ్బంది తగ్గుతుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు, ఆఫ్‌లైన్ బుకింగ్‌లపై ఆధారపడే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది,ఇక .క్రెడిట్ కార్డ్ రివార్డులు, బ్యాంకింగ్ ఛార్జీలు: పలు ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల విధానం, ఇతర సర్వీస్ ఛార్జీలను సవరించనున్నాయి. ఇక ఐటీఆర్ ఫైలింగ్ గడువు : సాధారణ ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్లు జూలై 31 లోపు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ ఆన్‌ టైంలో ఐటీఆర్ ఫైల్ఓ చేయయకపోతే వారు ఆగస్టు1 నుంచి విలంబిత రిటర్న్ సమర్పించాల్సి ఉంటుంది. దీని వల్ల ఫైన్ పడే ఛాన్స్ ఉంది. ఇక , లోన్, వీసా దరఖాస్తులలో ఆలస్యం కాకుండా .CKYC 2.0:ఆగస్టు నుంచి ఆర్థిక సంస్థలు మరింత వేగవంతం చేయనున్నాయి. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్‌లలో కొత్త ఖాతాలు తెరిచేటప్పుడు ప్రతిసారీ పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేకుండా డిజిటల్ రికార్డుల ద్వారా వెరిఫికేషన్ పూర్తవుతుంది. మీ మీ పేరు, చిరునామా, మొబైల్ నంబర్, గుర్తింపు కార్డులు అన్ని అప్‌డేట్‌లో ఉన్నాయో లేదో చూసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *