సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: టాలీవుడ్‌లో వరుసగా 2 సిరీస్ లు హిట్ తో మోస్ట్ సక్సెస్ ఫుల్ హార్రర్ ఫ్రాంచైజీ ‘పొలిమేర; సినిమా మూడో భాగం ఎలా ఉండబోతుంది..? ఇటీవల ‘బ్లాస్ట్; సినిమాతో 80 కోట్ల కలెక్షన్స్ సాధించి అందరి మతి పోగొట్టిన సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ ఈసారి ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో పొలిమేర 3 హార్రర్ సస్పెన్స్ జోన్ నుంచి యాక్షన్ వైపు రానుందా..? కరోనా సమయంలో పొలిమేర మొదటి పార్టు ఓటిటి లోను ,,పార్ట్ 2ను థియేటర్లలో విడుదల చేసి హిట్ కొట్టారు మేకర్స్. .అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో లోబడ్జెట్ లో తెరకెక్కించిన ఈ చిత్రంలో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించారు. పార్ట్ 1తో పోలిస్తే పొలిమేర 2ను భారీగానే తెరకెక్కించారు.. తాజాగా మూడో భాగం మొదలైంది. ఈ సినిమా మరింత భారీగా నిర్మిస్తున్నారు. ‘మా ఊరి పొలిమేర’ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ‘పొలిమేర 3’ సికింద్రాబాద్‌లో మహిమానిత గణేష్ ఆలయంలోషూటింగ్ ప్రారంభమైంది. యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కాబట్టి తమిళంలోనూ ఈ ప్రాజెక్ట్‌కు మార్కెట్ రావడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *