సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం విశాఖపట్నంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ అడ్జక్షతన నిర్వహించిన భారతీయ జనతా పార్టీ విస్తృతస్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో పాటు రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, జాతీయ నాయకులు దగ్గుబాటి పురందేశ్వరి, ఎంపీ పాక సత్యనారాయణ, మంత్రి సత్యకుమార్ యాదవ్ , మరియు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ప్రారంభించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్‌తో కలిసి పశ్చిమగోదావరి జిల్లా బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్‌ను సందర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా ప్రత్యేకతలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ స్టాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆక్వా ఉత్పత్తులను ప్రదర్శించారు. వేలకోట్ల ఎగుమతులతో జిల్లాలో మత్స్య, ఆక్వా రంగానికి ఉన్న ప్రాధాన్యతనుఅధ్యక్షులు నితిన్ నబీన్‌కు వివరించారు. పశ్చిమగోదావరి జిల్లాలో మత్స్య, ఆక్వా రంగం అభివృద్ధికి , ఆక్వా రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఈ సందర్భంగా వివరించారు అనంతరం జరిగిన బీజేపీ విస్తృతస్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలలో అనుసరించవలసిన ప్యూహాలపై చర్చించారు.
