సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. నేడు, బుధవారము శాసనమండలిలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి లో మరోసారి ..మెగా డీఎస్సీపై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ వాయిదా తీర్మానాన్ని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో చైర్మన్ పోడియం వద్ద వైసీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళనతో. డీఎస్సీపై చర్చ పెట్టాలని వైసీపీ సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి ఆ పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మెడలో నల్ల కండవాలతో ఆ పార్టీ సభ్యులు సభకు వచ్చారు. వైసీపీ సభ్యులు ఆందోళనతో ఏపీ శాసన మండలిని చైర్మన్ ఆదేశాలను, సభను గౌరవించటం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. చైర్మన్ సభను ఎందుకు అదుపులో పెట్టడంలేదని, అన్నారు. మనోహర్ వ్యాఖ్యలపై చైర్మన్ కొయ్యే మోషేను రాజు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభా నిర్వహణ నిబంధనల గురించి నాకు తెలుస్తునని.. గతంలో స్వీకర్ గా మీకు బాగా తెలుసు అని అన్నారు. గౌరవ సభలో సభ్యులపై ఎలాంటి పరిస్థితులలో మాత్రమే చర్యలు ఎలా తీసుకోవాలో మీకు తెలుసునని చెప్పారు. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చైర్మెన్ మోషను రాజు నుద్దేశించి మాట్లాడుతూ.. మీరు జగన్ హయాంలో నుండి కూడా మండలికి మీరు చైర్మన్‌గా వ్యవహరించారని అన్నారు. గతంలో రెడ్ లైన్ గీసి విపక్షాల వాళ్లు ( టీడీపీవాళ్లను )దాటి వస్తే సస్పెండ్ చేశారని ప్రస్తావించారు. ఇప్పుడు కూడా అలాగే చేసేందుకు మీకు అధికారాలున్నాయని తెలిపారు. మరి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని నిలదీశారు. చైర్మన్‌ను కించపరచాలనే ఆలోచన తమకు లేదని.. చైర్మెన్ కు పవర్స్ ఉన్నాయని తమకు తెలుస్తునని అన్నారు. ఈ దశలో చైర్మెన్ మోషేను రాజు సభను వాయిదా వేశారు.
