సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని నేడు, మంగళవారం అకస్మాతుగా మృతి చెందిన విషయాన్ని ముందుగా ఆయన పెంపుడు కుక్క (మ్యాక్సీ) గుర్తించిందని పెద్ద అరుపులతో మొరగటంతో ఇంట్లోకి వెళ్లి చూశానని అప్పటికే అయన కుప్పకూలిపోయి ఉన్నారని ఆళ్ల నాని ఇంటి వాచ్‌మన్ అప్పారావు తెలిపారు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అప్పటికే ఆయన చనిపోయి పావుగంట అయిందని వైద్యులు నిర్ధారించారని తెలిపారు. ఆళ్ల నాని మృతదేహం వద్ద మ్యాక్సీ కూర్చొని కంటతడి పెట్టుకొని తన విశ్వాసాన్ని చాటుకొంది. ఆళ్ల నాని మృతదేహం నేటి రాత్రి 10 గంటలకు ఏలూరుకు చేరుకునే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన అంత్యక్రియలు ఉంగుటూరు మండలం బాదంపూడి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించాలని భావిస్తున్నారు. విదేశాల్లో ఉన్న ఇద్దరు కుమారులు బుధవారం సాయంత్రం ఏలూరు చేరుకుంటారని తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుండి విశేషంగా ప్రముఖులు హాజరు కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *