సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ,ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(ఆళ్ల నాని)నేడు అకస్మాత్తుగా విశాఖ పట్నంలో కన్నుమూశారు. 3 సారులు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీ గా ఏలూరు నుండి ఎన్నికయిన నాని వయస్సు 57 ఏళ్ళు. . 1969 డిసెంబర్ 30న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆళ్ల నాని జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అమెరికా, రెండో కుమారుడు ఇంగ్లండ్‌లో విద్యాభ్యాసం చేశారు. 1994లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయ అరంగేట్రం చేసిన నాని.. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తదుపరి 1999లో ఎన్నికల్లో కూడా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కి అతి సన్నిహితుడుగా 3వ సారి కాంగ్రెస్ టికెట్ తీసుకోని 2004లో టీడీపీ అభ్యర్థి అంబికా కృష్ణపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2004- 2013 వరకు ఏపీ శాసనసభలో కాంగ్రెస్ సభ్యుడిగా పనిచేశారు. 2013లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికలలో వైసీపీ తరఫున అసెంబ్లీ బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. అయితే జగన్ ఇచ్చిన భరోసాతో జిల్లా వైసీపీ పార్టీ ప్రెసిడెంట్ గా మరియు 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికలలో ఏలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా, వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఓడిన ఆళ్ల నాని.. 2024 ఆగస్టు 17న ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2025 ఫిబ్రవరి 13న తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే టీడీపీ క్యాడర్ లో పట్టు సాధించలేకపోయారు. ఆళ్ల నాని మృతి పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *