సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం భీమవరంలో పలు ఇంజనీరీంగ్ కళాశాలలలొ ఇంజనీరింగ్ డే వేడుకలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్థానిక డీ.ఎన్.ఆర్. కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, భీమవరం యన్ ఎస్ ఎస్ (NSS) యూనిట్ ఆధ్వర్యంలో ఇంజినీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతదేశ ఇంజినీరింగ్ రంగానికి విశిష్ట సేవలందించిన ‘భారతరత్న’ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి’ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు సి.ఆర్. రెడ్డి కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డా. రామరాజు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంజినీరింగ్ విద్య కేవలం ఉద్యోగం కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడే పరిష్కారాలను అందించేందుకు దోహదపడాలని అన్నారు. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జీవితం, సేవలు, ఇంజినీరింగ్ రంగానికి ఆయన చేసిన విశేష కృషిని వివరించారు.విద్యార్థులు భవిష్యత్ సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేందుకు నిరంతరం జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, నూతన సాంకేతికతలపై అవగాహన కలిగి ఉండాలని డా. రామరాజు సూచించారు కళాశాల యాజమాన్యం వారు ఏలూరు సి.ఆర్. రెడ్డి కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డా. రామరాజు నిమరియు డీ.ఎన్.ఆర్. అసోసియేషన్ సెక్రటరీ & కరస్పాండెంట్ జి. సత్యనారాయణరాజు (బాబు) ని,కళాశాల వైస్ ప్రెసిడెంట్ శ్రీ జి. పాండురంగరాజుని ఘనంగా సన్మానించారు
