సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక ప్రక్క హర్ముజ్ జలసంధి తేలుచుకోకపోవడం మరో ప్రక్క ఇటీవల సౌదీ అరేబియా నుండి ఎర్ర సముద్రం నుండి వచ్చే చమురు నౌకలను ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటు దారులు అడ్డుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం చమురు ఎగుమతులకు తీవ్ర అడ్డంకులు ఏర్పడి చమురు ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. ఈ గల్ఫ్ యుద్ధం లో ‘ఇరాన్ తన పట్టు అద్భుతంగ’ కొనసాగిస్తుంది. ‘ప్యూహం’ లేకుండా బరిలో దిగిన ట్రంప్ కు, ఏమి చెయ్యాలో 7 నెల దాటిన అర్ధం కాక ప్రపంచాన్ని, అమెరికా ను కూడా సంక్షోభం లోకి నెట్టివేసాడు. ఇదిలా ఉండగా అమెరికా గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ హోర్ముజ్ జలసంధి మూసే ఉంటుందని ఇరాన్ తాజగా స్పష్టం చేసింది. ఈ మేరకు తమప్రభుత్వ నిర్ణయాన్ని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ ముహమ్మద్ బాఘెర్ గాలిబఫ్ స్పష్టం చేశారు. ఇకపై గల్ఫ్ దేశాలలో అమెరికా సేనల పట్టు కు కాలం చెల్లిందని సంచలన ప్రకటన చేసారు. ‘మోసం, ఏకపక్ష ధోరణులకు కాలం చెల్లిందని శత్రువుకు అర్థమైపోయింది. కాబట్టి, ఇరాన్ హక్కులను గుర్తించే వరకూ హోర్ముజ్ మూసే ఉంటుంది. చర్చలకూ అవకాశం ఉండదు’ అని స్పష్టం చేశారు.అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరాన్ అమెరికా ముందు పలు డిమాండ్స్ పెట్టింది. ఇరాన్ పోర్టుల చుట్టూ దిగ్బంధనం తొలగింపు, ఆంక్షల ఎత్తివేత, విదేశాల్లోని ఇరాన్ ఆస్తుల విడుదల, అన్ని రకాల మిలిటరీ చర్యలను కట్టిపెట్టడంపై జూన్‌లో ఒప్పందం ప్రకారం మాట నిలబెట్టుకోవాలని యూఎస్‌ను డిమాండ్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *