సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో భక్తి శ్రద్దలతో 5 లేదా 7 రోజుల పూజలు సంబరాలు తరువాత వినాయక నిమజ్జనాలు ఉపందుకోనాయి. అయితే నిమజ్జనాల ఊరేగింపు లో యువత సందడి మాములుగా ఉండదు. దానికి భారీ శబ్దాలతో డిజె సంగీత హోరు జత కలిస్తే ఇక యువత జోరు నృత్యల జోరు చూడాలి.. అయితే .. సున్నితంగా ఉన్న యువత, పెద్దలు లో ఆ శబ్దాలు తట్టుకొనే శక్తి ఉండదు. అందుకే రాష్ట్రంలో ఇటీవల 5 మంది యువకులు కుప్పకూలి మరణించారు. కాసేపటి క్రితం వరకు ఉత్సాహంగా కనిపించిన వారిలో కొందరు ఒక్కసారిగా కుప్పకూలుతుండటం కలవరపెడుతోంది. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం సగటున 80 డెసిబుల్స్ శబ్దానికి వారానికి 40 గంటల వరకు సురక్షితంగా వినొచ్చని సూచించింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోనూ గత శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. గణేష్ నిమజ్జన ఊరేగింపులో కాకర్లమూడి ఈసు అనే యువకుడు డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందినట్లు సమాచారం. .ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నేడు ఆదివారం తనను కలిసి నిమజ్జనాల్లో డీజేలకు అనుమతి ఇవ్వాలని కోరిన యువకులకు ఉండి నియోజకవర్గ పరిధిలో వినాయక నిమజ్జనాల్లో డీజే సౌండ్స్‌కు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. డీజే శబ్దాలతో యువత ప్రాణాలు కోల్పోతున్న ఘటనలను ప్రస్తావిస్తూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
