సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ ఏడాది బంగాళాతంలో ఏర్పడుతోన్న తొలి తుఫాను ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ పైన్ ముఖ్యంగా గోదావరి జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. ప్రస్తుతం వాయుగుండం గంటకు 5 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోందని, ఇది రేపటి సోమవారం ఉదయానికి తుఫానుగా మారుతుందని హెచ్చరించింది. ఇది బాపట్ల విశాఖ మధ్య యానాం వద్ద తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఏపీ ప్రభుత్వం తుఫానును ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టింది. అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించింది ప్రస్తుతం ఇది విశాఖకు 880 కి.మీ, కాకినాడకు 980 కి.మీ, మచిలీపట్నానికి 1,080 కి.మీ, బాపట్లకు 1,150 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలిపింది. దాదాపు దక్షిణ దిశగా కదిలి ఆదివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా, సోమవారం ఉదయానికి తుఫానుగా బలపడుతుందని పేర్కొంది. ముఖ్యంగా ఉత్తరాంద్ర , గోదావరి జిల్లాల ప్రజలు మంగళ, బుధవారాలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూసుకోవాలని ఏపీఎస్డీఏంఏ హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *