సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి శనివారం ఉదయం ఉండి హైస్కూల్ ప్రాంగణంలో ఆశ్రం హాస్పిటల్, ఏలూరు వారి సహకారంతో రెండు రోజుల పాటు నిర్వహించనున్న “మెగా హెల్త్ క్యాంపు” ను శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ప్రారంభించారు. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వైద్య సేవలను వినియోగించుకుంటున్నారు. ఈ శిబిరంలో అన్ని విభాగాలకు చెందిన 150 మందికి పైగా వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు, వైద్య సలహాలు అందిస్తున్నారు. రేపు ఆదివారం కూడా కొనసాగుతుంది. ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా ఈ మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశామని, ఉండి నియోజకవర్గ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రఘురామ కోరారు.
