సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ఈ సంవత్సరపు మూడవ జాతీయ లోక్ అదాలత్ ను మండల న్యాయ సేవా సంస్ధ ఆధ్వర్యంలో పెండింగ్ మరియు ప్రీ లిటిగేషన్ కేసుల పరిష్కారం నిమిత్తం భీమవరంలో వున్న అన్ని కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ ను నిర్వహించారు. ఏ కోర్టు కేసులు ఆ కోర్టులోనే పరిష్కరించుకునేలా మొత్తం 5 బెంచ్ లను ఏర్పాటు చేసారు.3వ అదనపు జిల్లా కోర్టు కేసులను పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి మరియు సంస్థ చైర్మన్ Dr. B. లక్ష్మీనారాయణ పరిష్కరించారు. సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టు కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులను ఆ కోర్టు న్యాయమూర్తి M. సుధారాణి రాజీ చేసారు.ఈ రోజు జాతీయ లోక్ అదాలత్ లో సివిల్ కేసులు 33, క్రిమినల్ కేసులు 355, బ్యాంకు, BSNL మొండి బాకీ కేసులు 33 మొత్తం 421 కేసులు రాజీ చేసారు. సుమారు మూడు కోట్ల యాభై అయిదు లక్షల రూపాయల విలువైన కేసులు రాజీ చేసి కక్షిదారులకు ఇప్పించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *