సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక “ప్రజా దర్బార్” ను శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు గారు నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలను రఘురామకృష్ణ రాజు కలిసి వారి సమస్యలను విన్నవించుకొన్నారు. సమస్యల పరిష్కార మార్గాలను అక్కడే అధికారులతో నేరుగా అడిగి తెలుసుకుని, కొన్ని సమస్యలను తక్షణమే పరిష్కరించి, మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కారం అయ్యేలా రఘురామా .. సూచనలు చేశారు.
