సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల రష్యా నగరాలపై , చమురు బావులపై ఉక్రెయిన్ చేస్తున్న తీవ్ర డ్రోన్ దాడులు రష్యా ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో తాజగా ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన డ్రోన్ దాడి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది.. ఈ ఏడాది రష్యా చేసిన అత్యంత భీకర దాడి ఇదేనని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. బుచా జిల్లాలోని మైలా ప్రాంతంలో ఉకెయిన్ ఆయుధాలను నిల్వ చేసిన గోదాముపై ఈ దాడి జరిగింది. గోదాము లోపలి ఆయుధాలు పేలిపోవడంతో మంటలు సమీపంలోని ఇళ్లు, భవనాలకు వ్యాపించి అనేక మంది దుర్మరణం చెందారు. రాజధాని ‘కివ్’తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై వరుస దాడులు జరగడంతో జనజీవనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. గగతల రక్షణ వ్యవస్థకు కీలకమైన పాట్రియల్ మిసైల్స్ నిల్వలు తగ్గిపోతున్నాయని ఇప్పటికే ఉక్రెయిన్ పలుమార్లు చెప్పింది. మిసైళ్ల సరఫరా పెంచాలని అమెరికాను సహాయం కోరుతుంది.
