సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను శ్రావణ మాస జాతర లను శక్తి వేషలు, కోలాటాలు , డప్పు సంబరాలతో వాడ వాడల నిర్వహించడం శుభపరిణామమని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. ఆదివారం భీమవరం రెస్ట్ హౌస్ రోడ్డులో జాలర్ల సొసైటీ సంఘం ఆధ్వర్యంలో శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని , రెస్ట్ హౌస్ రోడ్డులో రామాయలయం వద్ద తూర్పు కాపు సంఘం ఆధ్వర్యంలో శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి 60వ జాతర మహోత్సవాన్ని, లలిత దేవి అమ్మవారి దేవాలయం వద్ద శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి 3వ జాతర మహోత్సవాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం సాంప్రదాయ బద్దంగా బాణసంచా కాల్పులతో శక్తి వేషధారణలతో అమ్మవారి జాతర మహోత్సవం జరిగాయి. కార్యక్రమంలో యూత్ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.
