సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నా తీరు దేశ ప్రజలు అందరు చూసారు. ఒక్క వైసీపీ ని ఓడించడానికి ఇక్కడ కూటమి 3 పార్టీలతో పాటు పోలీసులు, అధికారులు, వ్యవస్థలు కలసి మొత్తం 6గురు కుమ్మక్కయ్యారు అంటూ వైసీపీ అధినేత జగన్ ఎన్నో ఆరోపణలు చేసారు. జాతీయ మీడియాలో ఏపీలో స్థానిక ఎన్నికలపై జరిగిన రచ్చ నేపథ్యంలో.. కారణాలు ఏవైనా.. ఇక్కడ ‘కూటమి’ విజయాలు ఫై ప్రధాని మోడీ కూడా ఇప్పటి వరకు హర్షం ప్రకటించలేదు... అయితే ఎన్నికలకు ముందు ఈ పరిస్థితులు ‘జగన్’ ఉహించి స్థానిక ఎన్నికలకు దూరంగా ఉండవచ్చు కదా? ఆలా దూరంగా ఉంటె అసలు వైసీపీ బలం ప్రజలకు అధికార కూటమికి ఎలా తెలుస్తుంది. అనువుగాని చోట అధికుడని అనరాదు అంటారు.. పెద్దలు.. అయితే సమయం కలసి రాకపోయిన.. స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని స్థానాలలో వైసీపీ అభ్యర్థులు పోటీ చేయవలసిందే! అని వైసీపీ అధినేత జగన్ ఒక ప్యూహం ప్రకారం ఇచ్చిన పిలుపును సుగ్రీవ ఆజ్ఞ గా పాటించి .. ఫలితం ఏదయినా సరే.. అంటూ మొండి పట్టుదలతో వైసీపీ పార్టీ శ్రేణులు ఏటికి ఎదురు ఈది .. గౌరవ ప్రదమైన స్థానాలలో గెలుపులు సాధించడం దేశ రాజకీయాలను విస్మయ పరచింది. రాష్ట్ర వ్యాప్తంగా 76 జడ్పీటిసిలు, ఏకముగా 1711 ఎంపీటీసీ లు, 200 పైగా ఎంపీపీలు, అల్లూరి జిల్లా పరిషత్తు చైర్మెన్ సీటును కూడా గెలుచుకోవడం రాష్ట్రంలో టీడీపీ పార్టీ తరువాత 2వ స్థానంలో ఉండటం గమనార్హం. మునిసిపల్ ఎన్నికలలో కూడా వైసీపీ అనంతపురం మేయర్, తొపాటు ముగ్గురు మునిసిపల్ చైర్మెన్ స్థానాలు గెలుపొందడం, వందలాది కౌన్సిలర్ సీట్లు గెలుపొందడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *