సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ రాజకీయాలలో సీఎం రేవంత్ రెడ్డి కి పరోక్షంగా పెద్ద షాక్ తగిలింది. నేడు శుక్రవారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో, కాంగ్రెస్ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది.కాగా.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి విజయం సాధించిన దానం నాగేందర్.. ఆ తర్వాత 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేశారు. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. అయితే దానం పార్టీ ఫిరాయింపునకు పాల్పడలేదంటూ ప్రస్తుత స్పీకర్ ట్రైబ్యునల్ గతంలో తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మహేశ్వర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దానం ఫై ఇక వేటు ఖాయం అని సత్యం జయించిందని కే టి ఆర్ వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *