సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: సౌదీ అరేబియా నుండి కూడా ముడి చమురు ఎగుమతులు లేకుండాఎర్ర సముద్రం వద్ద ఇరాన్ మద్దతు ఉన్న ‘హౌతీ’ లు అడ్డుకోవడంతో యుద్ధం మరింత తీవ్రతరం అయ్యి చమురు ధరలు మరింత పెరిగిపోతున్నాయి. దీనితో గత 3వారాలుగా దేశీయ స్టాక్ మార్కెట్ లో కొనసాగుతున్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతుంది. నేడు వారాంతపు (శుక్రవారం) ట్రేడింగ్ సెషన్లో భారతీయ స్టాక్ మార్కెట్ సూచీలు మిశ్రమ సంకేతాలతో ముగిశాయి.నిఫ్టీ 75.80 పాయింట్లు (0.33శాతం) పెరిగి 23,346.40 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ 19.63 పాయింట్లు( 0.026శాతం) కోల్పోయి 74,294.96 దగ్గర స్థిరపడింది. సెన్సెక్స్ ఈ ఉదయం 74,575.24 వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. రోజువారీ ట్రేడింగ్లో 74,728.44 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరినప్పటికీ, ముగింపు సమయానికి అమ్మకాల ఒత్తిడి కారణంగా 74,294.96 వద్ద ముగిసింది. సెన్సెక్స్ నిన్నటి ముగింపు (74,314.59) కంటే 19.63 పాయింట్లు (0.026శాతం) స్వల్పంగా క్షీణించింది.
