సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు, సంక్షేమంపై రాష్ట్రస్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో ఎస్సీ, ఎస్టీల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై, ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న పథకాలు, వారి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై హైపవర్ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో చర్చించారు. ఎస్సీ, ఎస్టీలకు రక్షణ, సంక్షేమం, అభివృద్ధి కోసం నాలుగు అంచెల కార్యాచరణను సక్రమంగా అమలు చేయాలని నిర్ణయించారు. 2026లో ఇప్పటి వరకూ నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తదితర 810 కేసుల్లో మొత్తం కేసులు పరిష్కృతమైనట్లు అధికారులు సీఎం కు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *