సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా గునుపూడి పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థనస్వామి వారి దేవస్థానం కృష్ణాష్టమి సందర్భంగా గత శుక్రవారం రాత్రి వేడుకలు ఊపందుకున్నాయి. శ్రీ జనార్ధన స్వామివారి ప్రక్కన ఉన్న ఉపాలయంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పుష్ప అలంకరణ లో భక్తులు విశేషంగా దర్శించుకున్నారు. జనార్దన స్వామి ఆలయములో పూజ కార్యక్రమము అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమం మన సాంప్రదాయ వైభవం గుర్తుండేలా నిర్వహించారు. ఉట్టి పోటీలలో పాల్గొన్న చిన్నారి బాలబాలికలకు శ్రీ కృష్ణా దేవత ప్రతిమలు. శ్రీ సోమేశ్వరుని చిత్ర పటాలు కానుకలుగా సమర్పించారు. అనంతరం శ్రీస్వామి వారి గ్రామోత్యవం గునుపూడి విధులలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంల లో దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు,ఛైర్మన్ చింతలపాటి బంగార్రాజు మరియు ఆలయ అర్చకులు, కార్యనిర్వాహణాదికారి డి రామకృష్ణంరాజు పాల్గొన్నారు
