సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో వాడవాడలా నిన్న నేడు, శనివారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు సాంసృతిక కార్యాక్రమాలు, కోలాటాలు సినిమాలు, వినోద ప్రదర్సనలు నాటకాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇస్కాన్ మందిరంలో వేడుకలు మరింత వైభవంగా ఈ 2 రోజులు నిత్యా ప్రసాద వితరణలతో సహా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈసారి శ్రీ కృష్ణాష్టమి వేడుకలు పట్టణంలో పలు అపార్ట్మెంట్స్ లోను, ఇతర నివాస భవనాలలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక త్యాగరాజ భవనం వద్ద పులపర్తి వారి విడిది భవనంలో పులపర్తి సాయి మణి దంపతులు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో సుమారు 200 మంది మహిళలు పాల్గొనగా పూజలు, ఆటపాటలు, లక్కీ డీప్ లో బహుమతులు, శ్రీ స్వామివారి 108 ప్రసాదాల ను మరల భక్తులకీ బహుమతులుగా ఇవ్వడం మంచి జోష్ లో వేడుకలు జరిపారు.
