సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు త్వరలో రూ.15 వేలు అందనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ.231.13 కోట్ల నిధులు విడుదల చేసింది. 2026-27 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆర్ధిక సాయం అందించేందుకు నిధులు విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద గత ఏడాది నుండి ఏడాదికి రూ.15 వేలు అందిస్తోంది. దీనికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలోనే వీటిని లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆఇందుకోసం ఆట్, క్యాబ్ డ్రైవర్లు స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తమ క్యాబ్‌కు సంబంధించిన పత్రాలు, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. అధికారులు పరిశీలించి అర్హతలన్నీ ఉంటే లబ్దిదారుల జాబితాలో చేరుస్తారు. సొంత వాహనం కలిగి ఉన్నవారికి మాత్రమే ఇవి అందుతాయి. గతంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను కూడా చెల్లించేందుకు కూడా ప్రభుత్వం సిద్దమైంది. సంక్రాంతికి ముందే వీటిని విడుదల చేసే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *