సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పరిసర ప్రాంతాలలో ఒక ప్రక్క ఎండ మరో ప్రక్క చలిగాలులును ప్రజలు ఆస్వాదిస్తున్నపటికి రేపు గురువారం నుండి వర్షాలతో రాబోతున్న 3వ తుపాన్ అక్వాన్‌.. దడ పుట్టిస్తోంది. ఇప్పటికే అర్నబ్‌, మురసు తుఫాన్‌ల బీభత్సానికి వారం రోజుల పాటు విద్యుత్తూ సరఫరా లేక, అల్లాడిన ప్రజలు, రైతులు ఇప్పుడు మళ్లీ అతి తీవ్ర తుఫాన్‌ వస్తోందంటేనే ఆందోళనలో ఉన్నారు.ఆగ్నేయ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావం ఇప్పటికే తీవ్ర చలిగాలుల రూపంలో పశ్చిమ గోదావరి జిల్లాపై కనపడుతుంది. నెల్లూరు– తుని మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. తీరం దాటే సమయంలో 145 కిలోమీటర్ల వరకు గాలులు వీస్తాయని, తుఫాన్‌ తీరం దగ్గరకు వచ్చే సమయంలో 110 నుంచి 120 కిలోమీటర్ల వరకు గాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం సముద్రంలో అలల ఉధృతి పెరిగిందని, రేపు 18వ తేదీ నుంచి కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు , కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో గాలుల తీవ్రతతో పాటు వర్షాలు ప్రారంభమవుతాయని, 19న భారీ నుంచి అతి భారీగా వర్షాలు, 20న భారీ నుంచి అత్యంత భారీగా వర్షాలు , పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. ఈరోజు సాయంత్రానికల్లావరి కోతలను పూర్తి చేసుకోవాలని, మత్యకారులు ఎవరు భీమవరం నరసాపురం తీరప్రాంతాలలో మేతకారులు ఎవరు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *