సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే .. ముస్లీమ్ ల మసీదుల్లో సేవలందిస్తున్న ఇమామ్, మౌజమ్‌లకు గౌరవవేతనాలను 3 నెలలు జీతాలు 30 వేలు చప్పున చెల్లించడానికి .. ఒకేసారి విడుదల చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం రూ.22.50 కోట్లు విడుదల చేసింది. 2026-27 ఏడాదికి సంబంధించి జులై నుంచి సెప్టెంబర్‌ వరకు వేతనాల చెల్లింపునకు ఈ నిధులు విడుదల చేసిందని వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ తెలిపారు. ఏపీ ప్రభుత్వం మసీదుల్లో సేవలందిస్తున్న ఇమామ్‌లు, మౌజన్లకు గుర్తింపుగా గౌరవ వేతనాలను చెల్లిస్తోంది. మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లకు నెలకు రూ.10,000, మౌజన్లకు నెలకు రూ.5,000 చొప్పున చెల్లిస్తున్నారు. గత 27 నెలలకు కలిపి ఇప్పటివరకు ఇమామ్‌లు, మౌజన్లకు మొత్తం రూ.202 కోట్ల గౌరవ వేతనాన్ని అందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మొత్తం 4,991 మంది ఇమామ్‌లు, 4,991 మంది మౌజన్లు కలిపి మొత్తం 9982మంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *