సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:రాష్ట్రంలో మొత్తం106 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ పదవులకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఈ మేరకు నేడు ,సోమవారం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జీవో జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైన భీమవరం మున్సిపాలిటీ ని , ఆకివీడు నగర పంచాయితీ ని జనరల్ మహిళల కు కేటాయించడం విశేషం. దీనితో భీమవరం, టీడీపీ ఇంచార్జి, మాజీ ఎంపీ తోట సీతారామ లక్ష్మి సూచించిన అభ్యర్థి కి లేదా వారి కుటుంబ సభ్యులలో ఒక మహిళకు దక్కే అవకాశం ఎక్కువగా కనపడుతుంది.ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీ కేటగిరీలో మొత్తం 3 స్థానాలు కేటాయించింది. అందులో 2 జనరల్, ఒకటి మహిళలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎస్సీ కేటగిరీలో మొత్తం14 స్థానాలు కేటాయించింది. వాటిలో 7 జనరల్, 07 మహిళలకు కేటాయించింది. బీసీ కేటగిరీలో మొత్తం 36 స్థానాలు కేటాయించింది. అందులో 18 జనరల్, 18 మహిళలకు కేటాయించింది. ఇక మహిళా కేటగిరీలో మొత్తం 27 చైర్ పర్సన్ స్థానాలు నిర్ణయించింది. అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీలో మొత్తం 26 చైర్ పర్సన్ స్థానాలు కేటాయించింది. అలాగే రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు రెండు మేయర్ పదవులు కేటాయిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అలాగే బీసీలకు ఐదు మేయర్ పదవులను రిజర్వ్ చేసింది. జనరల్ మహిళలకు ఐదు మేయర్ పదవులను కేటాయించగా.. నాలుగు కార్పొరేషన్ల మేయర్ పదవులను అన్రిజర్వ్డ్గా ప్రకటించింది.
