సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా ఎన్నికలలో ‘ఓటుచోరి’100 శాతం జరిగిందని దీనిపై జాతీయ ఎన్నికల కమిషన్ బాధ్యత వహించవలసిందేనని ఆరోపిస్తూ.. ఇక వదిలే ప్రసక్తి లేదని గత 6 రోజులుగా ఢిల్లీ వేదికగా ఆందోళనలు చేపడుతున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ల నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్‌కు వెంటనే రాజీనామా చేయాలంటూ, నేటి సోమవారం సాయంత్రం వేలాది మంది ఇండియా కూటమి పార్టీల క్యాడర్ తో చేసిన ర్యాలీ తో సెంట్రల్ ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోడ్లపై కిక్కిరిసిన జనంతో కన్నాట్ ప్లేస్ నుంచి మండి హౌస్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రతిపక్ష నేతలు పెద్ద ఎత్తున గుమిగూడి సుప్రీంకోర్టుకు బయలుదేరారు. ఇప్పటికే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (CJI)తో సంప్రదింపులు జరిపారు. అనంతరం ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై తాము సిద్ధం చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేసినట్లు వారి తరఫు న్యాయ బృందం ప్రకటించింది.
