సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఈవారంలో గురువారం లోపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుండంతో.. అధికారంలో ఉన్న కూటమి పార్టీలు సీట్ల పంపకాలపై ఫోకస్ పెట్టాయి. ప్రధానంగా మేయర్, మున్సిపల్ ఛైర్మన్‌‌ల పదవుల పంపకాలపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. నేటి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు, నివాసంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సమావశమవుతున్నట్లు సమాచారం. ఈ కీలక సమావేశంలో ఏపీలో స్థానిక ఎన్నికల సీట్ల పంపకాలపై ఎవరు ఏ స్థానంలో పోటీ చెయ్యాలి? వారి మధ్య చర్చకు వచ్చే కీలక అంశాలలో ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం .. రాష్ట్రంలో కీలకమైన ‘భీమవరం’ మున్సిపాలిటీ సిటు ఫై జనసేన టీడీపీ మధ్య పోరుకు ‘మధ్యేమార్గం’గా బీజేపీ కి కేటాయించాలని డిమాండ్ పెరిగింది. తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోనిమొత్తం 17 కార్పొరేషన్‌లలోని మేయర్‌ ‘జనసేన; పార్టీ కి నాలుగు మేయర్‌ స్థానాలుకి పక్కాగా విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ స్థానాలు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.12 మేయర్ స్థానాలలో టీడీపీ పోటీ చేస్తుంది. బీజేపీకి తిరుపతి కేటాయించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలపైనా చర్చలు జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *