సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వచ్చే సెప్టెంబర్ 27 న ఒకే రోజు రెండు భారీ సినిమాలు ఢీ కొట్టబోతున్నాయని ఫిలిం వర్గాల వార్త.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ,మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న “దేవర”..ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వికపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమా లో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ సినిమాను దర్శకుడు కొరటాల రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు.మొదటి పార్ట్ నుముందుగా పాన్ ఇండియా స్థాయిలో ప్రముఖ భాషలలో అక్టోబర్ 10 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసారు.అయితే తాజా సమాచారం ప్రకారం అనుకున్న తేదీ కన్నా ముందుగా అంటే సెప్టెంబర్ 27 న ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరి దేవర సినిమాకు పోటీగా మాస్ మహారాజ్ మూవీ రాబోతుంది.మాస్ మహారాజ్ రవితేజ, జగపతి బాబు కీలక పాత్రలో స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా రైడ్ కు రీమేక్ గా తెరకెక్కింది. రేపు సోమవారం జూన్ 17 న ఈ సినిమా నుంచి షో రీల్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.అలాగే ఈ సినిమాను సెప్టెంబర్ 27 న రిలీజ్ చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఎన్టీఆర్ సినిమా పోటీలో వున్నా కూడా రవితేజ వెనక్కి తగ్గడం లేదని తెలుస్తుంది.దీనితో ఈ ఇద్దరి స్టార్స్ మధ్య పోటీ రేంజ్ ఏ మేర ఉంటుందో తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *