సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:నేటి శుక్రవారం తెల్లవారు జాము మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంభం పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఆటోని పెళ్లి బృందాన్ని లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 4 గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. గాయపడ్డ వారిని అంబులెన్స్‌లో కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు గిద్దలూరు నల్లబండ బజారుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. నల్లబండ బజారుకు చెందిన వీరక్కకు కంభముకు చెందిన పాములేటికి నేటి ఉదయం 9 గంటలకు వివాహం జరగవలసి ఉంది. కంభంలోని వై జంక్షన్ వద్ద వినాయకుడి గుడిలో కొబ్బరికాయ కొట్టేందుకు పెళ్లి బృందం ఆగిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. ప్రమాదంలో అలకనంద (19), అంకాలు (20, నగేష్ (17), సంఘటన స్థలంలోనే మృతి చెందగా నాగేశ్వరి (2) అనే ఏడాదిన్నర చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *