సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా మధ్య మరల దాడులు ప్రతి దాడులతో యుద్ధ ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్లను పతనం లోకి త్రోసేస్తున్నాయి. కువైట్‌లోని యూఎస్ మిలిటరీ బేస్‌లపై ఇరాన్ నేరుగా క్షిపణి దాడులు చేయడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. మరల అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీనితో నేడు, బుధవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచే మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం గం.11 సమయానికి సెన్సెక్స్ 851 పాయింట్లు పతనమై, 73,803 వద్ద ట్రేడవుతోంది. అయితే నేటి మధ్యాహ్నం నుండి మెల్లగా కోలుకొని సెన్సెక్స్ 303 పాయింట్స్ నష్టంతో 74, 346 వద్ద ట్రేడింగ్ తో సాయంత్రం ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 78పాయింట్స్ నష్టం తో 23 405 ముగిసింది. ఈరోజు మార్కెట్ పతనానికి ఐటీ రంగానికి చెందిన దిగ్గజ షేర్లు ప్రధాన కారణమయ్యాయి. ముఖ్యంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఏకంగా 6.65శాతం కుప్పకూలగా, పర్సిస్టెంట్ సిస్టమ్స్ (Persistent Systems) 5.16శాతం నష్టపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.70గా ఉంది.
