సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ దేశాలలో మళ్లీ మొదలైన యుద్ధ ఉద్రిక్తతలు భారత్ దేశీయ సూచీల లాభాలను మరల వెనక్కి లాగాయి. ఇరాన్-అమెరికా పరస్పర దాడులు మొదలైన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. గత సెషన్ ముగింపు (73,918)తో పోల్చుకుంటే నేటి బుధవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభాల్లోకి ఎగబాకింది. అయితే మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాల్లోకి జారుకుంది. చివరకు సెన్సెక్స్ 64 పాయింట్ల స్వల్ప లాభంతో 73,983 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ స్వల్ప నష్టాలను మూటగట్టుకుంది. 27 పాయింట్ల నష్టంతో 23,214 వద్ద స్థిరపడింది (stock market ).బ్యాంక్ నిఫ్టీ 94 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 905 పాయింట్లు నష్టపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *