సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:త ఆగస్టు 3న కోనసీమ జిల్లా ఓడలరేవు ఫిషింగ్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నుంచి IND-AP-E8-MO-135 ‘ముత్యాలమ్మ’ బోటులో ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు. అనంతరం వారుఅల్ప పీడనం గాలుల తీవ్రతకు గల్లంతయ్యారు. అప్పటి నుంచి వారి ఆచూకీ కోసం అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు 23 రోజుల తరువాత బెంగాల్‌-ఒడిశా బోర్డర్‌లో మత్స్యకారుల ఆచూకీని మరో బోటు సిబ్బంది గుర్తించారు. గల్లంతైన మత్స్యకారులంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందడంతో వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *