సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రశాంత నగరం గా పేరొందిన కాకినాడ లో ఇటీవల క్రైమ్ రేటు పెరుగుతుంది. తాజగా కాకినాడ నగరం లో ప్రధాన సెంటర్ గా ప్రసిద్ధి పొందిన భానుగుడి సెంటర్‌లో నేటి బుధవారం తెల్లవారు జాము సుమారు 2 గంటల సమయంలో కోడమాటి సతీష్ రెడ్డి(30) అనే జిమ్ ట్రైనర్‌పై కొందరు వ్యక్తులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. సతీష్ రెడ్డిపై బందుల సాయికిరణ్‌తో పాటు అతని స్నేహితులు దాడికి తెగబడ్డారు అని తెలుస్తుంది. దాడి సమయంలో కర్రతో సతీష్ రెడ్డి గొంతులో పొడిచారు. ఈ భయానక దాడి తో తీవ్ర రక్త స్రావం తో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. హత్యపై కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమ సంబంధం, ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమై ఉండవచ్చనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *