సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోని చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకొంది. ఇకపై యూనివర్సిటీల పాలనలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. నేడు శుక్రవారం నుండి రాష్ట్రంలో 19 విశ్వవిద్యాలయాల పాలక మండళ్లను రద్దు చేసింది. గత ప్రభుత్వ హయాంలో నియమించిన నామినేటెడ్ సభ్యులను తొలగించింది. ఈ మేరకు ఆయా విశ్వవిద్యాలయాల గవర్నింగ్ బాడీల రద్దుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్లాజ్-2 కింద నియమితులైన పాలక మండలి సభ్యులపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పదవీ రీత్యా కొనసాగుతున్న సభ్యులకు ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. అయితే క్లాజ్-1 కింద ఉన్న ఎక్స్‌-ఆఫిషియో సభ్యులు యథావిధిగా కొనసాగుతారు. విశ్వవిద్యాలయాల పాలక మండళ్ల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ)కు కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాల్లో కూడా కొత్త పాలక మండళ్ల ఏర్పాటుకు చర్యలు మొదలు పెట్టినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *