సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గంలోని కాళ్ళ మండలం, ప్రాతాళ్లమెరక గ్రామానికి చెందిన వేగిరాజు శివవర్మ దాతృత్వంతో , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు P4 పిలుపు స్ఫూర్తితో గ్రామంలోని 30 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 2 సెంట్ల చొప్పున కేటాయించిన ఇంటి స్థల పట్టాలను నేడు, శుక్రవారం ఉదయం శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు చేతుల మీదుగా అందజేశారు. రఘురామా మాట్లాడుతూ.. ఈ పట్టాల పంపిణీతో లబ్ధిదారుల సొంత ఇంటి కల నెరవేరుతోందని, త్వరలోనే ఈ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం కూడా పూర్తికానుందని.. సీఎం చంద్రబాబు పీ 4 మంచి ఫలితాలు ఇస్తుందని అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు ముందుకు వచ్చిన వేగిరాజు శివవర్మకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు తో పాటు పాలకోడేరు సహకార బ్యాంకు చైర్మెన్ కొత్తపల్లి నాగారాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *