సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులు, కార్మికులకు కళాకారులందరికీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ లో శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశపు గొప్ప నేత వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్న నైపుణ్యం గల చేతులను గౌరవిద్దామని అన్నారు. ప్రతి చేనేత వస్త్రం మన సంస్కృతిని, చేతిపనితనాన్ని, స్వావలంబన స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందన్నారు. చేనేతను ఎంచుకోవడం ద్వారా, దేశ సంప్రదాయాలను పరిరక్షించుకోవడంతో పాటు నేత కార్మికుల జీవనోపాధిని బలోపేతం చేస్తామని అన్నారు.. తాను చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం గర్వకారణమన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో అర్హులైన నేత కార్మికులకు ఉచిత విద్యుత్, రూ.25,000 సహాయం అందించే ‘నేతన్న సేవలో’ పథకంతో సహా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. భారతదేశపు అమూల్యమైన చేనేత వారసత్వాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోందని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *